దేవుడు ప్రసాదించిన చక్కటి స్వరంతో ఒక్కరోజులో దివ్యగాత్రి అయిపోయిన నిరుపేద మహిళ రాణో మండల్ కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద స్టార్ సింగర్‌గా వెలిగిపోతున్నారు! ఇటీవలే బాలీవుడ్ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ హిమేశ్ రిషమియాతో కలిసి ప్రస్తుతమింకా పూర్తి కాని ఒక సినిమా ఆడిషన్ కోసం రాణో పాడిన 'తేరీ మేరీ.. తేరీ మేరీ కహానీ' పాట.. ఆమె గొంతులోంచి యూట్యూబ్ ద్వారా శ్రోతల చెవుల్లో అమృతాన్ని ఒలికించింది. లతా మంగేష్కర్‌ను తన ఆరాధ్య గాయనిగా కొలిచే రాణో నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ రైళ్లలో పాటలు పాడుకుంటూ తిరిగే యాచకురాలని మీరు చదవే ఉంటారు.
మితిమీరిన మేకప్: గుర్తుపట్టలేనంతగా రాణో..!